చిత్తూరు: ఏజెన్సీ ప్రాంతంలో సోనియాగాంధీ సన్ని హిత కుటుంబమైన జిందాల్ కంపెనీకి బాక్సైట్ గనులను కట్టబెట్టారని టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు ఆరో పించారు. దీని వల్ల వేమంది గిరిజన కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అవి నీతి కార్యకలాపాలను అడ్డుకొనేందుకు ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధి ఎందుకు పర్యటించరు ఆయన ప్రశ్నించారు. చిత్తూరులో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంనేందుకు వచ్చిన ఆయన మీడియాతో సమాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. ఇక ఈ గిరిజనుల పలకరించేందుకు ఎందుకు రాహుల్‌గాంధీ రాష్ట్రానికి రారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో రాహుల్‌గాంధీ పాదయాత్రను చేపట్టి అక్కడ ప్రభుత్వాన్ని అస్థిర పరచడాని కేనని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన కేంద్రం కనుసన్నల్లోనా, లేక సోనియా గాంధీ నడుపుతున్నారా లేక గవర్నర్ నడుపుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవ సాయ, ఆరోగ్య, విద్య అభివృద్ధిలను గాలికి వదలి అంత ర్ఘత కుమ్ములాటల్లో మునిగిపోయిందన్నారు.వైఎస్‌ఆర్ అవినీతిపై మూడు సంవత్సరాల నుంచి టిడిపి పోరాటం చేస్తుందని తెలిపారు.