విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మాంసం ముగ్గురి ప్రాణాలు తీసింది. నిల్వ ఉంచిన మాంసం తినడం వల్ల ముగ్గురు గిరిజనులు మృత్యువాత పడినట్లు వైద్యులు తెలిపారు. అతిసారా వ్యాధి ప్రబలిన నేపథ్యంలో ఈ మరణాలు సంభవించినట్లు భావిస్తున్నారు. నిల్వ ఉంచిన మాంసం తినడం వల్ల మరణాలు సంభవించాయి. విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం చింతగున్నె గ్రామంలోని ముగ్గురు మరణించారు.
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో విపరీతంగా అతిసారా వ్యాధి ప్రబలింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలోకి వైద్యుల బృందాలను పంపారు. అతిసారాను కట్టడి చేసేందుకు ఆ బృందాలు పనిచేస్తున్నాయి.