తెలంగాణ న్యాయవాదులకు అన్యాయం చేయలేదు: మోపిదేవి

Mopidevi Venkataramana
హైదరాబాద్: హైకోర్టులో 42 శాతం వాటా కావాలంటూ న్యాయవాదులు చేస్తున్న డిమాండ్లు సరియైనవైతే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి మోపిదేవి వెంకటరణ సచివాలయంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. హైకోర్టు ఉద్యోగాల్లో తమ వాటా తమకు కావాలంటూ తెలంగాణ లాయర్లు గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ లాయర్ల ఐకాస పిలుపు మేరకు 10 జిల్లాల నుంచి న్యాయవాదులు భారీ ఎత్తున తరలి రావడంతో హైకోర్టు వద్ద బుధవారం ఉద్రిక్తంగా మారడం, భారీ ఎత్తున పోలీసుల మోహరించిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, గీతారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

స్టాండింగ్ కమిటీతో పాటు పలు కమిటీలలో తెలంగాణ వారి ప్రాతినిథ్యాన్ని మోపిదేవి వివరించారు. తెలంగాణకు ఎక్కడా ఎలాంటి అన్యాయం జరగలేదన్నారు. ఒకవేళ అన్యాయం జరిగినట్టు తమ దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం పరిశీలించి, వారి డిమాండ్లు న్యాయమైనవైతే పరిష్కరించే దిశలో ఆలోచిస్తుందని తెలిపారు. ఏవైనా సమస్యలుంటే శాంతియుతంగా పరిష్కారం అయ్యే దిశలో ఆలోచించాలి. కాని ఇలా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం సరికాదన్నారు.

అందరి న్యాయం కోసం పోరాడాల్సిన న్యాయవాదులు ఇలా గందరగోళం సృష్టించడం భావ్యం కాదని వర్యాటక శాఖా మంత్రి గీతారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం న్యాయవాదులతో రెండుగంటలపాటు భేటీ నిర్వహించి పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేశామని అయినప్పటికీ ప్రభుత్వం స్పందించ లేదనటం సమంజసం కాదన్నారు. న్యాయవాది అయిన మహాత్మాగాంధీ సైతం స్వతంత్రం కోసం శాంతియుతంగా పోరాడాడని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఏ ఒక్క ప్రాంతం ప్రీతిపదమైనది కాదని అన్నింటిని సమదృష్లితో చూస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+