గ్రూప్ వన్ పరీక్ష రద్దుకు కాంగ్రెసు తెలంగాణ ఎంపిల ఒత్తిడి

ఏపీపీఎస్సీలో అక్రమాలు ఉన్నాయంటూ, చైర్మన్ అనంత వెంకటరామిరెడ్డి చర్యల వల్ల తెలంగాణ విద్యార్థి తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తోందని వారు విమర్శించారు. 2006లో జరిగిన ఏపీపీఎస్సీలో ఇక్కడి విద్యార్థిలోకం ఆయన చర్యలవల్ల నష్టపోయారని గుర్తు చేశారు. అయన అప్పట్లో ప్రాంతీయ తత్వంతో, పక్షపాత ధోరణిలో పరీక్షలు నిర్వహించారన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన యూపిఎస్సీ రద్దు చేసి మళ్లీ నిర్వహించారని, ఆ తరహా సంస్కరణలు ఇక్కడ అవసరమన్నారు. పేపర్ లీక్ అయినా పరీక్ష నిర్వహించడాన్ని వారు ప్రశ్నించారు. ఇంటర్లో డిస్టింక్షన్ వచ్చిన వారు ఈ పరీక్షల్లో ఫెయిల్ అవడం ఏపీపీఎస్సీని నిర్వాకమేనన్నారు.
తెలంగాణలో విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో మొన్న జరిగిన ఏపీపీఎస్సీని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షకు తెలంగాణలోని చాలామంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వరంగల్, స్మానియాలోని బి.ఇడి. కళాశాలల్లో విద్యార్థులు పూర్తి స్థాయిలో గైర్హాజరయ్యారు. కాగా గవర్నర్ నరసింహం ఏపీపీఎస్సీ విషయంలో చేతులెత్తేసిన విషయం తెలిసిందే. వినతి పత్రం అందించిన తర్వాత సైతం ఆయన దగ్గరనుండి ఎలాంటి స్పందన లేకుంటే తమ అధినేత్రి సోనియాగాంధీకి సైతం తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు, ఎమ్మెల్యేలు విన్నవించుకునే ఆస్కారం ఉన్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications