రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే జోగి రమేష్ కు స్వల్పగాయాలు
State
oi-Pratapreddy
By Pratap
నల్దొండ: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే జోగి రమేష్ కు స్వల్పగాయాలయ్యాయి. జిల్లాలోని మోతె వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రమేష్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రమేష్ కు స్వల్పగాయాలు కాగా, ఆయన గన్ మెన్ కు మాత్రం ఎక్కువయ్యాయి. దీంతో వారిని వెంటనే సూర్యపేటలోని మధుబాబు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఓవర్ టేక్ చేయటానికి ప్రయత్నించటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తారు.