అసెంబ్లీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం: తీవ్ర ఉద్రిక్తత

కాగా, తెలంగాణవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురేయడానికి ఎబివిపి కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అంగీకరించకపోవడంతో పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. వరంగల్ లో ఎబివిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. హన్మకొండలో ఎబివిపి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మిగతా తెలంగాణ జిల్లాల్లోనూ ఇదే వాతావరణం నెలకొని ఉంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఎబివిపి డిమాండ్ చేస్తూ వస్తోంది. మెదక్ జిల్లా సిద్ధిపేటలో పోలీసులు 20 మంది ఎబివిపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications