ఖమ్మం: ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన పురపాలక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆయన తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్న సభలోకి తెలంగాణవాదులు పెద్ద యెత్తున దూసుకుని వచ్చారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ వారు డిమాండ్ చేశారు. తెలంగాణవాదులను అదుపు చేయడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.