Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైయస్ జగన్ కు తలనొప్పి: మామగారి మరో స్కామ్

Ravindranath Reddy
హైదరాబాద్ : కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డి మరో ఎరువుల కుంభకోణం వెలుగు చూసింది. దీంతో వైయస్ జగన్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నారు. ఎరువుల అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలోనే దాదాపు వంద కోట్ల రూపాయల మరో ఎరువుల కుంభకోణాన్ని ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక వెలికి తీసింది. రైతులకు చెందాల్సిన సబ్సిడీని రవీంద్రనాథ్ రెడ్డి మెక్కేశారని, అన్ని చట్టాలను ఉల్లంఘించి క్రిబ్ కో, ఇఫ్కో వంటి కంపెనీలు ఉత్పత్తి చేసిన ఎరువులను తన హరిత ఫ్యాక్టరీకి మౌఖిక ఆదేశాలతో తరలించుకుపోయారని ఆ పత్రిక రాసింది.

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 20 మిక్సింగ్ ప్లాంట్లకు 4.5 వేల టన్నుల యూరియాను అక్రమంగా తరలించినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో ఇప్పటికే బయటపడింది. ఇందులో రవీంద్రనాథ్‌రెడ్డికి చెందిన కంపెనీలే అధికంగా ఉన్నాయి. రవీంద్రనాథ్‌రెడ్డికి చెంది రంగారెడ్డి జిల్లా కీసరలోని హరిత ఫర్టిలైజర్‌కు అక్రమంగా ఈ ఏడాది 3,400 టన్నులు తరలివెళ్లినట్లు విచారణలో బయటపడింది. ఇందులో 2,200 టన్నులు ఆగాపూర్‌లోని తారమా మ్యాక్స్ ద్వారా తరలించగా వేయి టన్నులను మార్క్‌ఫెడ్ నేరుగా సరఫరా చేసింది. ఇది చాలదన్నట్లుగా నిబంధనలకు విరుద్ధంగా క్రిభ్‌కో కంపెనీ నేరుగా మరో 200 టన్నులను హరిత కంపెనీకి విక్రయించింది. ఈ ఎరువుల్లో మార్క్‌ఫెడ్ ద్వారా తరలించిన వేయి టన్నులను ఇఫ్కో తయారు చేయగా మిగిలిన ఎరువులు క్రిభ్‌కోలో ఉత్పత్తి అయ్యాయి.

నేరుగా ఎరువులను దిగుమతి చేసుకునేందుకు ఒక సమయంలో ఇబ్బంది రావడంతో అతిగతీ లేని ఆగాపూర్‌లోని 'తారమా మ్యాక్స్' పేరుతో 2200 టన్నులను దిగుమతి చేసుకున్నారు. మూడో కంటికి కూడా తెలియకుండా ఇదంతా జరిగిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని వేల టన్నుల యూరియా, డీఏపీలో దారి మళ్లినట్లు తెలుస్తోంది. గత ఏడాది, ఈ ఏడాది ఎరువుల కొరతకు మిక్సింగ్ ప్లాంట్లే ఓ కారణంగా అధికార వర్గాలు చెబుతున్నాయి ఎలాంటి ఆధారం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో యూరియాను కేటాయించేందుకు జిల్లా మేనేజర్ నిరాకరించారు. అయితే కంపెనీ యాజమాన్యం వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారుల నుంచి ఆయనపై ఒత్తిడి తెచ్చి యూరియాను విడుదల చేయించింది. ఇపుడు దీనిపై వివాదం రేగడంతో వారంతా కింది స్థాయి అధికారులపై నెట్టేస్తున్నారు. కింద స్థాయి అధికారులు కేసులో ఇరుక్కుపోయారు. రంగారెడ్డి జిల్లాలోని కీసరలో రెండేళ్ల క్రితం నిర్మించిన హరిత ఫ్యాక్టరీకి ఏయే ఎరువులను ఏ రకంగా తరలించరానే వివరాలను కూడా ఆ పత్రిక అందించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+