హైదరాబాద్: ఆమెరికాలో మన రాష్ట్రానికి చెందిన విద్యార్థి వెంకటకృష్ణారెడ్డి అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ కు చెందిన ఇతడు కొన్ని రోజుల క్రితం అమెరికాలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆయన వెళుతున్న కారు ఫ్లై ఓవర్ నుండి సముద్రంలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా మృతి చెందిన యువకుడు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి రాగిడి లక్ష్మా రెడ్డి కుమారుడిగా గుర్తించారు.