రామోజీరావు నుంచి కెసిఆర్ ఏడు కోట్లు తీసుకున్నారు: కాకా

కెసిఆర్ చర్యల వల్ల తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించినవారి ఆత్మలు క్షోభిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ గురించి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని, కెసిఆర్ వల్ల తెలంగాణ ఎన్నిటికీ రాదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీయే విప్లవం సృష్టిస్తుందని ఆయన అన్నారు. సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమం కెసిఆర్ కు తెలియదా అని ఆయన అడిగారు. డిసెంబర్ తర్వాత విప్లవం తెస్తానని కెసిఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ ను తానే ఢిల్లీకి తీసికెళ్లానని, ఢిల్లీ పెద్దలకు తానే పరిచయం చేశానని, అది తన ఖర్మ అని ఆయన అన్నారు. కెసిఆర్ తీరు తనకు బాధ కలిగిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణను కెసిఆర్ అమ్ముకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications