హైదరాబాద్: చాలాకాలం తరువాత రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సచివాలయంలో సమావేశం కానుంది. సమకాన రాష్ట్ర రాజకీయాంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న తెలంగాణ న్యాయవాదుల సమస్య, ఎరువుల సమస్య, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి అక్రమాలపైన, గణేశ్ నిమజ్జనం, గ్రూప్ 1 పరీక్షలు తదితర విషయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా తెలంగాణ న్యాయవాదుల ఉద్యమం నేపథ్యంలో ప్రాంతాల వారీగా, కులాల వారీగా ప్రభుత్వ నియామకాల్లో పుట్టుకొస్సున్న వాటా ఉద్యమాలపై చర్చిస్తారు.ఐతే ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలకు కారణమైన ఎరువుల అక్రమాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.