జిహచ్ఎంసి కార్యాలయం ఎదుట రోడ్లు బాగు చేయాలని టిడిపి ధర్నా

నగరవాసులు రహదారులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిచి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ధర్నాలో పేర్కొన్నారు. రోశయ్య ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకునే ఆలోచనలో ప్రజల సమస్యలను విస్మరిస్తోందన్నారు. టిడిపి వారు జిహెచ్ఎంసి కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. వారు మరింత రెచ్చిపోవటంతో టిడిపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications