భోపాల్: సోమవారం ఉదయం మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లా భాదర్వాస్ రైల్వే స్టేషన్లో రైలు ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్లో ఆగిఉన్న ఇండోర్ గ్వాలియర్ ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్ ను ఓ గూడ్సు రైలు వేగంగా వచ్చి ఢీకోంది. దీంతో ఈ ప్రమాదంలో 20 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం. సుమారు 100మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలోమూడు బోగీలు ధ్వంసమయ్యాయి. నాలుగు బోగీల్లో ప్రయాణికులు ఇరుక్కుపోయారు. బోగీల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. అక్కడం భారీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఎదురవుతోంది. ఐనా రక్షించేందుకు వైద్య, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు. సహాయక చర్యల్లో మూడు హెలికాప్టర్లు కూడా పాల్గోన్నాయి.