మంత్రివర్గ సమావేశంలో ప్రాంతాల గొడవ: సిఎం క్లాస్

హైదరాబాదులో నెలకొన్న రహదారి సమస్యలకు నిధులు కేటాయించామని, త్వరలో అందుకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ నెల 24న అతి సున్నితమైన అయోధ్యపై కేసు విచారణ ఉంది, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని, పోలీసులను ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చర్యలు తీసుకోవాలని రోశయ్య సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ క్రిమిలేయర్ సాధ్యం కాదని, దీనిపై త్వరలో ఆర్డినెన్సు జారీ చేయనున్నట్టు రోశయ్య చెప్పారు. గ్రూప్ 1 పరీక్షలపై ముఖ్యమంత్రి మౌనంగానే ఉన్నారు. ఐతే స్థానిక సంస్థలలలో ప్రత్యేక అధికారులను నియమించి పాలన సాగించాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెనుకంజ వేసింది. ఇప్పట్లో ఎన్నికలు ఉండవని ప్రకటించింది.
కొందరు మంత్రులు, ఎంపీలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని వారిని అదుపులో ఉంచాల్సిందిగా మంత్రులు దానం నాగేందర్, దామోదర రాజనర్సింహ, ముఖేష్ గౌడ్ కోరారు. ఎరువుల విషయమై మంత్రి రఘువీరారెడ్డికి మరో మంత్రి బొత్స సత్యనారాయణకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. తెలంగాణపై సీమాంధ్రులకు, తెలంగాణ మంత్రులకు మధ్య కూడా తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మధు యాష్కి, వివేక్, మంద సత్యనారాయణ వంటి కొందరు తెలంగాణ ఎంపీలు కేసీఆర్ కు మౌత్ పీస్ గా పని చేస్తున్నారని వారిని అధిష్టానానికి చెప్పి కట్టడి చేయాలని సూచించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం మొన్న మొన్ పార్టీలోకి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీమాంధ్ర మంత్రులు దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications