అక్రమ సంపాదన కోసమే:కెసిఆర్ పై నామా గరం గరం

ఒకవైపు పైకి వ్యాపారాల పేరుతో తెలంగాణను ముంచుతున్నారంటూనే మరోవైపు వారితో భేటీ పెట్టడం వెనుక అక్రమ సంపాదనే లక్ష్యంగా ఉందని తెలుస్తోందన్నారు. వారి వ్యాపారాలను కొమ్ముకాసి వారి నుండి లాభాన్ని ఆర్జిస్తున్నారన్నారు. నాలుగు రోజుల క్రితం లగడపాటిని పొగడటం కూడా ఇందులో భాగమేనన్నారు. తెలంగాణను ఏమైనా వారి కుటుంబం గుత్త పట్టిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో అన్ని ముఖ్య పదవులు వారి కుటుంబ సభ్యులవేనని, ఉన్న పదిమందిలో ఆయన, ఆయన కొడుకు, అల్లుడు ముగ్గురు పదవిలో ఉన్నారని దుయ్యబట్టారు.
గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలుగు దేశం అధినేత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాటలను కెసిఅర్ వక్రీకరించారన్నారు. బాబు మాటలను వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక ఛానల్ పదే పదే ప్రసారం చేస్తూ తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వాలని చూస్తుందని, కాని ఒకవైపు ఆంధ్ర వ్యాపారస్తులను తెగుడుతూ మరోవైపు వారితో చర్చలు జరుపుతున్న కెసిఅర్ ను ప్రజలు నమ్మరనే విషయాన్ని టీఆర్ఎస్ తెలుసుకోవాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications