రంగారెడ్డి: హైదరాబాద్ సమీపంలో ఉన్నా రంగారెడ్డి జిల్లాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఆడ పక్షులు గుడ్డు పెడుతాయని ఎవరూ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ రంగారెడ్డి జిల్లాలో మాత్రం కోడిపుంజు గుడ్డు పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో గ్రామస్తులు, పక్క ఊళ్లోనివారు చాలామంది వచ్చి పుంజును దర్శించుకొని పోతున్నారు. జిల్లాలోని పరిగి మండలం రాఘవాపూర్ లోని ఓ రేషన్ దుకాణం యజమాని ఇంటిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
కోడిపుంజు గుడ్డు పెట్టడం కేవలం జన్యులోపం కారణం డాక్టర్లు అంటున్నారు. పెట్టెకు సంబంధించిన అంటే గుడ్డు పెట్టడానికి కావాల్సిన ఆడ లక్షణాలు పుంజులో ఉండటమే కారణమన్నారు.