విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కె చంద్రశేఖర రావు భావనను ప్రేమించిన లగడపాటి రాజగోపాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ: ఐ లవ్ యూ చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నుంచి సమాధానం వచ్చింది. కెసిఆర్ భావనను తాను ప్రేమిస్తున్నట్లు ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. "కేసీఆర్ గాంధేయ మార్గంలో సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని సంకల్పించడం అభినందనీయం, సంతోషదాయకం. ఈ భావనను నేను ప్రేమిస్తున్నాను" అని తెలిపారు.'మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎంతవరకు వచ్చింది?' అని విలేకరులు ప్రశ్నించగా, కేసీఆర్ గాంధీ మార్గ భావనను మాత్రమే తాను ప్రేమిస్తున్నానని తెలిపారు.

మద్య నిషేధంపై చంద్రబాబు ఉద్యమం ప్రస్తావన వచ్చినపుడు లగడపాటి ఫక్కున నవ్వారు. ఇది హాస్యాస్పదమని, అందుకే నవ్వానని తెలిపారు. "1996 పార్లమెంట్ ఎన్నికల సమయంలో చంద్రబాబు మద్యపానాన్ని ఎత్తివేస్తామని ఓటర్లకు ఒట్టేసి చెప్పారు. నెల తిరక్కముందే బెల్టుషాపులకు తెరలేపారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమైనా చేయాలి. అధికారం పోయిన తర్వాత మద్యపాన నిషేధ ఉద్యమం అనడం హాస్యాస్పదం'' అని తెలిపారు. తనమామ ఎన్టీఆర్ విధించిన మద్య నిషేధానికి తూట్లు పొడిచి, ఇప్పుడు ఎవరిని మభ్యపెట్టడానికి ఈ ఉద్యమమని చంద్రబాబును ప్రశ్నించారు. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ 'బెజవాడ రౌడీలు' అనే టైటిల్‌ను మార్చితే బాగుంటుందన్నారు. అందులో బెజవాడ పదం తొలగించాలని ఆయన రామ్ గోపాల్ వర్మకు సూచించారు. సినిమా రాకముందే దాడిచేస్తాం, రాళ్లతో కొడతాం అనడం సమంజసం కాదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X