కెసిఅర్ కన్నా నీచుడు, లోఫర్ దేశంలోనే లేడు: తలసాని శ్రీనివాస్ యాదవ్

కొత్త పార్టీ ఆవిర్భావంతో కెసిఆర్ కుటుంబానికి రోజులు దగ్గర పడతాయన్నారు. తనకో పదవి, కొడుక్కు ఓ పదవి, అల్లుడికి ఓ పదవి, కూతురుకు మరో పదవి ఇలా కుటుంబమే పదవులన్నీ అనుభవిస్తూ బలహీనవర్గాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలు కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో కెసిఆర్ కు త్వరలో తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన దొరతనం, కలెక్షన్లు, ఆంధ్రా వ్యాపారులతో సమావేశాలు త్వరలో ఉండవన్నారు. తెలుగు దేశంతోనే ఎదిగిన కెసిఆర్ అదే తెలుగు దేశాన్ని ఇప్పుడు తిట్టడం సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు.
ప్రజా గాయకుడు గద్దర్ ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదని అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని తెలిపారు. గద్దర్ లాంటి ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న నాయకుడు తెలంగాణ కోసం ముందు నడిస్తే తాము ఆయన వెనుక నడవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గద్దర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం ఉధృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications