హైదరాబాద్ లో భారీ దొంగతనం: 80 తులాలు బంగారం, 45 కిలోల వెండి
Districts
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్ లో మంగళవారం మధ్యాహ్నం భారీ దొంగతనం జరిగింది. బంజారాహిల్స్ లోని అరోరా కాలనీలో ఉంటున్న సత్యం రెడ్డి అనే వ్యాపారి ఇంట్లో 80 తులాల బంగారం, 45 కిలోల వెండిని దొంగలు దోచుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దొంగతనం జరిగింది. అయితే ఇది తెలిసిన వారి పనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.