రాష్ట్రంలోని సగం సంపద వైఎస్ కుటుంబానిదే: జగన్ పై చంద్రబాబు ధ్వజం

మైక్రో ఫైనాన్స్ సంస్ధల వేధింపులతో మృతి చెందుతున్న వారి పాపం ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం చేతకానితనం వల్లనే మైక్రో సంస్థల దారుణాలు పెరుగుతున్నాయన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీయే మైక్రో పైనాన్స్ లను ప్రమోట్ చేశారని గుర్తు చేశారు. రాహుల్ సైతం వారి మృతికి బాధ్యత వహించాన్నారు. మంత్రులు దోచుకోవడానికి పోటీ పడుతున్నారు కానీ రాష్ట్ర ప్రజలను పట్టించుకోవటంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.
70వేల కోట్లు పెట్టి కామన్వెల్తును నిర్వహిస్తున్న కేంద్రం మన ఆటగాళ్లను పట్టించుకోవటంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కామన్వెల్తుకు కొన్ని నెలలకు ముందుగానే మన ఆటగాళ్లకు తర్ఫిదునిస్తే మరిన్ని స్వర్ణాలు సాధించి ఆస్ట్రేలియా కంటె ముందు ఉండేవాళ్లమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆటగాళ్లకు ప్రోత్సాహకాలు, రివార్డులు, ఆవార్డులు ఇచ్చి ప్రోత్సహించామని కాని కాంగ్రెస్ ప్రభుత్వం వారిని విస్మరిస్తోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications