కర్ణటకలో రాష్ట్రపతి పాలన విధిస్తే దేశవ్యాప్త ఉద్యమం

Dattatreya
రాజమండ్రి: రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తించిన కర్ణాటక గవర్నర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. గవర్నర్ బాహటంగానే కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రవర్తిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని కాలదన్నుతున్నాడని విలేకరుల సమావేశంలో అన్నారు. కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధిస్తే దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాజ్యాంగబద్దంగానే యెడ్యూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిందని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఉత్తి చేతులతోనే తిరిగి వస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా అయన మాటలు ఎవరూ వినిపించుకునే పరిస్థితులు లేవని, చివరకు ఆయన మంత్రివర్గం, పార్టీ వాళ్లే ఆయన మాటలకు విలువ ఇవ్వడం లేదన్నారు. చివరకు ఆయనకు సోనియాగాంధీ వద్ద కూడా విలువ లేకుండా పోయిందని అందుకనే ఆయన కోటి ఆశలతో ఢిల్లీ వర్యటిస్తున్నప్పటికీ సోనియా ఆయన ఆశలపై నీళ్లు జల్లుతుందన్నారు.

రాష్ట్లంలో మైక్రోఫైనాన్స్ సంస్థన ఆగడాలు మరీ శృతిమించుతున్నాయని, వాటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మైక్రో ఫైనాన్స్ లను ప్రోత్సహించిన పాపం రాహుల్ గాంధీదే అన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతులు కల్తీ విత్తనాలు వాడి పంట నష్టపోతున్నారని అందుకు ప్రభుత్వం బాధ్యత వహించటంతో పాటు విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+