పులిలా వచ్చిన వాడు ఇప్పుడు పిల్లిలా మారిపోయాడు

గవర్నర్ లు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా మారుతున్నారని, మొన్న కర్ణాటక సంక్షోభంలో గవర్నర్ భరద్వాజ్ ప్రవర్తనే ఇందుకు పెద్ద ఉదాహరణ అన్నారు. భరద్వాజ్ కాంగ్రెస్ అనుకూలంగా రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తించాడన్నారు.
కాంగ్రెస్ నాయకులు పదవుల లేక పిచ్చి పట్టినాళ్లలా తిరుగుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీ చుట్టూ, విస్తరణ ఉంటే తమ మంత్రి పదవులు కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు అనుకూలంగా మంత్రి పదవి దక్కించుకోవటానికి రోశయ్య చుట్టు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. వీరే కాకుండా కాంగ్రెస్ నాయకులంతా తమ తమ పదవుల కోసం పోరాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడాన్ని మరిచిపోయారన్నారు.












Click it and Unblock the Notifications