మహబూబ్ నగర్ జిల్లాలోని రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
Districts
oi-Pratapreddy
By Pratap
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. కర్నూలు వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సుమో ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతులంతా కడప జిల్లా ఇటిక్యాలపాడుకు చెందిన వారుగా గుర్తించారు.