జగన్ ఓదార్పుపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలి: వి హనుమంతరావు

ఇప్పటి వరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కెబినెటే ఉందని దానిని మార్చాల్సిన అవసరం ఉందని విహెచ్ ఆభిప్రాయపడ్డారు.ముఖ్యమంత్రి రోశయ్యకు ఇప్పటికైనా సొంత కేబినెట్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసి గత శాసన సభ ఎన్నికల్లో నాకు టిక్కెట్ రాకుండా చేశారని ఆరోపించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని, ఆ కుంభకోణంలో ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. నామినేటెడ్ పదవులను పార్టీ అధిష్టానం అడ్డుకోవటం లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications