లోకేష్ చానెల్ ఇష్యూ: టార్గెట్ టిడిపి అధినేత చంద్రబాబే

స్టూడియోఎన్ వ్యవహారాన్ని వ్యాపారంగా కొట్టేస్తున్న చంద్రబాబు ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై ఎందుకు ఆందోళన చేస్తున్నారని ఆయన అడిగారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ ది వ్యాపారం కాదా అని ఆయన అడిగారు. స్టూడియోఎన్ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ఐక్యంగా పోరాడుదామని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్ పిలుపునిచ్చారు. ఉద్వాసనకు గురైన సిబ్బందిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందినవారు కావడంతో రాజ్ న్యూస్ కూడా చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తోంది. సాక్షి టీవీ చానెల్ ప్రతి రోజు స్టూడియోఎన్ పై విమర్శలతో వార్తాకథనాలను ప్రసారం చేస్తోంది. స్టూడియోఎన్ ను ఏకంగా బాబు చానెల్ అంటూ వ్యాఖ్యానిస్తోంది.












Click it and Unblock the Notifications