నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ ఢిల్లీ యాత్రకు కాంగ్రెసు విరుగుడు
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: తెలంగాణ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ యాత్ర చేపట్టిన తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి లేఖ రాశారా అని తెలంగాణ కాంగ్రెసు సారథ్య బృందం ప్రశ్నించింది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలంగాణ ఇవ్వాలని విజ్ఞప్తి చేయడానికి తమతో కలిసి అన్ని పార్టీలు రావాలని లేఖ రాసిన నాగం జనార్ధన్ రెడ్డి ఢిల్లీ రైలు యాత్ర జయప్రదం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే నాగం సోనియా గాంధీకి తెలంగాణ విషయమై లేఖ ఇచ్చే సమయంలోనే తాము ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి లేఖ ఇవ్వనున్నట్లు వారు చెప్పారు.