చంద్రబాబుతో పెరుగుతున్న నాగం జనార్దన్ రెడ్డి విభేదాలు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తెరాస కార్యకర్తలపై కన్నా తమ పార్టీ కార్యకర్తలపైనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ కెసిఆర్ కబంధ హస్తాల నుంచి బయటపడాలని ఆయన సూచించారు. తెలంగాణపై ఢిల్లీకి రావాలని తాము ఆహ్వానించినా ఇతర పార్టీలు రాకపోవడం వారిష్టమని ఆయన అన్నారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పార్టీలో చర్చించి సమష్టిగా ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. ఫజల్ అలీ కమిటీ నివేదిక కన్నా శ్రీకృష్ణ కమిటీ నివేదిక గొప్పదేం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications