ఎన్టీఆర్ హత్యలను ప్రోత్సహించలేదు, పోరాడుతాం: పరిటాల సునీత

బెజవాడ తెలుగు దేశం పార్టీ నాయకుడు, పరిటాల రవీంద్ర అనుచరుడు వల్లభనేని వంశీ సైతం రాంగోపాల్ వర్మ రక్తచరిత్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ తనకు స్నేహితుడని, ఆయన్ను నేను దగ్గరనుండి చూసిన వ్యక్తినని, ఆయనది శాడిస్టు మెంటాలిటీ అన్నారు. కోట్లమంది ఆరాదించి దేవుడు, తెలుగు జాతి ప్రతిష్టను వ్యాప్తి చేసిన ఎన్టీఆర్ ను వర్మ నెగిటివ్ పాత్రలో చూపించటంతో ఆయన శాడిజం అర్థమవుతున్నదన్నారు. మరో నాయకుడు ఇ.పెద్దిరెడ్డి కూడా వర్మపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను అవమానించే విధంగా ఉన్న దృశ్యాలను చిత్రం నుంచి తొలగించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications