చంద్రబాబు మెదక్ పర్యటన ఉద్రిక్తం: విద్యార్థుల అరెస్టు

అయితే అక్కడ తెలంగాణవాదులు, విద్యార్థులు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు చంద్రబాబును అడ్డుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తెలుగు దేశం డౌన్ డౌన్, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు తెలంగాణకు మద్దతిస్తేనే తెలంగాణలో పర్యటించాలని, లేదంటే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. తెలంగాణకు మద్దతు ఇవ్వాలనుకుంటే వెంటనే శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వాలని వారు సూచించారు.
కాగా విద్యార్థుల అరెస్టును దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రోశయ్య ప్రతిపక్ష నేత చంద్రబాబుతో కుమ్మక్కయి విద్యార్థులను అరెస్టు చేశారన్నారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని లేకుంటే జరగబోయే పరిణామాలకు చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం ప్రజల హక్కును కాలరాస్తుందని, తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబు తన పర్యటన రద్దు చేసుకోవాలని పలువురు తెరాస నేతలు అంటున్నారు.












Click it and Unblock the Notifications