నా పర్యటనను అడ్డుకోవడం మూర్ఖత్వం: చంద్రబాబు నాయుడు

మిగతా పార్టీలు బాధితులను ఇంత వరకు పరామర్శించింది లేదని, ఆ పార్టీలు చేయని పని నేను చేస్తుంటే అభినందించాల్సింది పోయి ఇలా దాడి చేయటం అమానుషమన్నారు. పార్టీలు ప్రజా సేవలో ఉండాలి. కాని తనపై దాడి చేయటానికో, తన పర్యటనను అడ్డుకోవడానికే కాదని హితవు పలికారు. పర్యటనను అడ్డుకోవటంలో చూపిన శ్రద్ధ ప్రజ సమస్యలు పరిష్కరించటంలో చూపించండన్నారు.
బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుండి 50వేల రూపాయలు ఇవ్వటంతో పాటు వారి పిల్లలకు ఉచితంగా చదువును చెప్పించనున్నట్టు చెప్పారు. సూక్ష్మ రుణ సంస్థలు ప్రజల ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాయన్నారు. 70 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం శోచనీయమన్నారు. సూక్ష్మ రుణాలు వెంటనే మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications