రైల్వేలైన్ కోసం తెరాస అధ్వర్యంలో ధర్నా: పలుచోట్ల ట్రాఫిక్ జాం

దేవుడి వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు రైల్వేలైన్ కోసం కేంద్రం పచ్చజెండా ఊపినా రాష్ట్రం మాత్రం నిర్లక్షం వహిస్తుందని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య దీనిపై శ్రద్ద చూపించకపోతే అందరి ముఖ్యమంత్రుల వలె ఆయన కూడా సీమాంధ్ర పక్షపాతి అనిపించుకోవాల్సి వస్తుందన్నారు. 2006లో తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు రైల్వే సహాయ మంత్రిగా ఉన్నప్పుడు రైల్వేలైన్ కోసం కేంద్రం నుండి ఆమోద ముద్ర వేయించుకున్నప్పటికీ ఆ క్రెడిట్ ఎక్కడ కెసిఆర్ కు వెళుతుందోనని నాటి ముఖ్యమంత్రి వైఎస్ దానిని ప్రారంభించలేదని ఆరోపించారు. రోశయ్య ఐనా దానిని ప్రారంభించి తనకు తెలంగాణపై రెండో చూపు లేదని నిరూపించుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications