నిరసనల మధ్య డిఎస్సీ - 2008 నియామకాల కౌన్సెలింగ్

వరంగల్ లో బిఇడి అభ్యర్థులు కౌన్సెలింగ్ సెంటర్ పై దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. నిజామాబాద్ కౌన్సెలింగ్ సెంటర్ ను బిఇడి అభ్యర్థులు ముట్టడించారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. కర్నూలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిఇడి అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. డిఇవోను డిఎస్సీ అభ్యర్థులు కొట్టారు. మొత్తం 50 వేల పోస్టుల భర్తీకి పూనుకున్నారు. వీటిలో ఇప్పటికే 20 వేల పోస్టుల భర్తీ జరిగింది. డిఇడి అభ్యర్థులు లేక రెండు వేల పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications