విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడో రోజుకు చేరిన టిడిపి నేతల నిరసన: గన్నవరం పిఎస్ వద్ద ఉద్రిక్తత

By Pratap
|
Google Oneindia TeluguNews

TDP Leaders
విజయవాడ: కృష్ణా డెల్టా ఆధునీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం నాయకులు చేపట్టిన నిరసన శనివారం మూడో రోజుకు చేరుకుంది. ఏరియల్ సర్వే సందర్భంగా ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలవడానికి వచ్చిన తెలుగుదేశం నాయకులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి తెలుగుదేశం శాసనసభ్యులకు మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. అయితే, అందరినీ అనుమతించాల్సిందేనని పట్టుబడుతూ తెలుగుదేశం నాయకులు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు అరెస్టు చేసి గన్నవరం పోలవీసు స్టేషనుకు తరలించారు. అప్పటి నుంచి వారు పోలీసు స్టేషను వద్దనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

డెల్టా ఆధునీకరణ పనులు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు విమర్శించారు. ఆధునీకరణ పనులను తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని మంత్రి పార్థసారథి చేసిన విమర్శలను ఆయన ఖండించారు. డ్రైనేజీ సిస్టం దెబ్బ తినడం వల్ల 30 లక్షల ఎకరాలకు నష్టం వాటిల్లుతోందని ఆయన అన్నారు. మంత్రి పార్థసారథి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. గన్నవరం పోలీసు స్టేషనుకు పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల తెలుగుదేశం నాయకులు కూడా తరలి వస్తున్నారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X