హైదరాబాద్ లో పట్టపగలే వెంటాడి వెటాడి రౌడీ షీట్ ను చంపారు

Hyderabad
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాదులో పట్టపగలో దారుణ హత్య జరిగింది. నాంపల్లిలోని కోర్టులో ఓ కేసు విషయమై సాక్ష్యం చెప్పడానికి వచ్చిన పంజాగుట్ట రౌడీ షీటర్ ఫజల్ ను కొందరు దుండగులు హత్య చేశారు. నాంపల్లి కోర్టులో ఫజల్ ఓ కేసు విషయం సాక్ష్యం చెప్పి తిరిగి వెళుతున్నాడు. ఆ సమయంలో కొందరు హఠాత్తుగా వచ్చి ఆయనపై దాడి చేశారు. గమనించిన ఫజల్ అక్కడినుండి పరుగందుకున్నాడు. రెడ్ హిల్స్ లోని ఓ అపార్టుమెంటులో దూరాడు. అయితే ఆ దుండగులు అక్కడకు చేరుకొని ఫజల్ ను దారుణంగా పొడిచి చంపారు.

కాగా ఫజల్ హత్య కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పేరుమోసిన బడా రౌడీషీటర్ ఆయుబ్ ఖాన్ కు ఫజల్ తోడల్లుడు. వీరిద్దరు కలిసి హైదరాబాదులో లాండ్ సెటిల్మెంటులు చేసేవారు. కొన్నాళ్లు వారిద్దరు కలిసి సెటిల్మెంటులు చేశారు. కొద్దికాలం తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఈ హత్యను ఆయుబ్ ఖానే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిద్దరి మధ్య లాండుసెటిల్మెంటు గొడవలు ఉండటంతో ఆర్థికలావాదేవీల కారణంగా హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే మరో రౌడీషీటర్ ఖైజర్ కూడా ఈ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+