పార్లమెంటు సమావేశాలకు వైయస్ జగన్ కొన్నాళ్లు డుమ్మా?

అపోలో ఆస్పత్రి నుంచి ఆయన సోమవారం బెంగళూర్ లోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆయన విశ్రాంతి తీసుకునే అవకాశాలున్నాయి. నిజానికి, సోమవారం సాయంత్రం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పార్లమెంటును ఉద్దేశించి చేసే ప్రసంగానికి జగన్ హాజరవుతారని భావించారు. కానీ, ఆయన వెళ్లడం లేదు. పార్లమెంటు సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే, జగన్ కొన్నాళ్ల పాటు పార్లమెంటు సమావేశాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. విశ్రాంతి తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాతనే ఆయన ఢిల్లీకి వెళ్తారని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications