వైయస్ బతికి ఉంటే అసహ్యించుకునేవారు: పొంగులేటి సుధాకరరెడ్డి

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను చేపట్టిన ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ జాతీయ నాయకులైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఫోటోలు పెట్టారా అని ఆయన ప్రశ్నించారు. వారి ఫోటోలు పెట్టని వారు వైయస్ ఫోటో పెట్టలేదని ప్రశ్నించటం విడ్డూరమన్నారు. జగన్ కాస్త బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో, కార్యక్రమాల్లో ఆందోళన లేకుండా చూడాలని సూచించారు.
వైయస్ అభిమానులమంటూ కొందరు చేస్తున్న కృత్యాలను వైయస్ బతికి ఉంటే అసహ్యించుకునే వారన్నారు. వైయస్ ఎప్పుడు కూడా అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడటంగానీ, కార్యక్రమాలు చేయటం గానీ చేయలేదన్నారు. అధిష్టానం ఆదేశాలు పాటించే ఏ పనైనా చేసేవారన్నారు. వైయస్ నిత్యం సోనియాను ఆకాశానికి ఎత్తేవారన్నారు. కాగా కెకెపై కావురి మాటలను కూడా పొంగులేటి తప్పు పట్టారు. కావురి ఒక పార్లమెంటు సభ్యుడు అయి ఉండి అభ్యంతరకర మాటలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆయన మాటలను చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications