జగన్ మద్దతుదారు బాలినేనికి మంత్రి పదవి ఇవ్వొద్దన్న దగ్గుపాటి

ప్రకాశం జిల్లాకు చెందిన దగ్గుబాటి పురందేశ్వరి భర్త వెంకటేశ్వరరావు సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గురువారం ఇక్కడ సీఎంను కలిశారు. తమ జిల్లా నుంచి కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ మద్దతుదారుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని గట్టిగా కోరారు. ఆయనకు కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని వారు కిరణ్‌కుమార్‌రెడ్డికి స్పష్టంచేశారు. జగన్ కు గట్టి మద్దతుదారుడిగా ఉన్న బాలినేని మంత్రిగా ఉండి కూడా వివిధ సందర్భాల్లో అధిష్ఠానం మాటను పెడచెవిన పెట్టిన విషయం గుర్తు చేశారు.
బాలినేనికి మాజీ మఖ్యమంత్రి రోశయ్య జగన్ ఓదార్పులో పాల్గొనవద్దని స్వయంగా చెప్పినప్పటికీ ఓదార్పు యాత్రలో కలిసి సాగటం వివాదాస్పదమైంది. ఈక్రమంలోనే ఆయనకు మళ్లీ మంత్రి పదవి కట్టబెట్టవద్దని ప్రకాశం జిల్లాకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. కిరణ్‌కుమార్‌రెడ్డి తమ అభ్యర్థన మన్నించకపోతే బాలినేని అంశాన్ని గతంలో పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లిన మాదిరే మళ్లీ తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications