పదవుల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి: మాజీ మంత్రి మారెప్ప
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: మంత్రివర్గం, కార్పోరేషన్ పదవుల్లో యువతకు పనిచేసే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ మంత్రి మారెప్ప కొత్తగా ఎన్నికయైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. నామినేటెడ్ పదవులు పొంది ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేసే నేతలే పార్టీలో ఎక్కువగా తయారయ్యారని ఆరోపించారు. అన్ని వర్గాల నేతలను కలుపుకుంటూ సమస్యలపై తక్షణమే స్పందించాలని ఆయన కొత్త సీఎంను కోరారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని తాజా మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన గౌరి వెంకట్‌రెడ్డి కలిశారు. తితిదే అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి వెంకటేశ్వరస్వామి వారి ప్రసాదాన్ని అందించారు.