వైయస్ జగన్ కు షాక్: వైయస్సార్ విగ్రహాల స్థాపనపై బ్యాన్

విగ్రహాల స్థాపనపై నిషేధం విధించడం వెనక రాజకీయ కారణాలున్నాయని వైయస్ జగన్ అనుచరులు మండిపడుతున్నారు. తమను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వందలాది వైయస్ విగ్రహాలు తయారై ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో వైయస్ జగన్ గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టాల్సి ఉంది. ఆయన ఓదార్పు యాత్రలో బాధితులను పరామర్శించడంతో పాటు విరివిగా వైయస్సార్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికే కలెక్టర్ ఆ ఆదేశాలు జారీ చేసినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications