జగన్మోహన్ రెడ్డిది తొందరబాటు చర్య: కోటగిరి విద్యాధరరావు

పార్టీ పెట్టకముందు విషయాలను పార్టీ పెట్టిన తర్వాత వాటిగా ఆపాదించడం సరికాదన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉండమని ప్రజలు తీర్పునిస్తే కాంగ్రెస్ మద్దతు ప్రకటించడమేమిటని జగన్ వర్గం సభ్యులు మాకు చెప్పే వారు కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏ సమస్య వచ్చినా మద్దతునిస్తామన్నారు. అయితే జగన్ సమస్యతో మాకు సంబంధం లేదన్నారు. జగన్ సమస్య నిన్న మొన్న వచ్చిందని, కాని తాము ఎప్పటినుండో ప్రజలకోసం ఆలోచించే పార్టీగా మద్దతు ఇస్తామని చెబుతున్నామన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం అందువల్లనే చెప్పామన్నారు. మళ్లీ ప్రజలను ఎన్నికలకు తీసుకుపోయి భారం మోపే ఉద్దేశ్యం ప్రజారాజ్యం పార్టీకి లేదన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని బెర్తులు ప్రజారాజ్యం కోసం ఉంచారని చెప్పడం ఆయన తమ పార్టీకి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నామని, అందుకు తాము సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు తాము సామాజిక తెలంగాణ అన్నప్పటికీ ఎన్నికల తర్వాత ప్రజాభిప్రాయం ప్రకారమే సమైఖ్యంద్ర నినాదాన్ని ఎత్తుకున్నామన్నారు.












Click it and Unblock the Notifications