బూడిద గుమ్మడికాయ హల్వా ఇలా చేసి తిని చూడండి.. దాంపత్య జీవితం జింగా లాలా!

తెలుగు రాష్ట్రాలలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, స్వీట్ షాప్ లలో చాలా ప్రత్యేకంగా, ఎంతో ప్రాచుర్యం పొందిన స్వీట్ గుమ్మడికాయ హల్వా.. ఇది మామూలు గుమ్మడికాయ కాదు. బూడిద గుమ్మడికాయ హల్వా. దీనినే తెల్ల గుమ్మడికాయ హల్వా అని, కాశీ హల్వా అని, కూష్మాండ లేహ్యం అని కూడా అంటారు. ఈ హల్వా మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

బూడిద గుమ్మడికాయ హల్వా తయారీ ఇలా

ముఖ్యంగా బలహీనంగా ఉన్న శరీరానికి శక్తిని ఇస్తుంది. వీర్య వృద్ధికి ఉపయోగపడుతుంది. శారీరక క్షీణతను తగ్గిస్తుంది. శృంగార సమస్యలకు కూడా ఇది మంచి పరిష్కారంగా ఉంటుంది. ఎన్నో విధాలా ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మరి అటువంటి బూడిద గుమ్మడికాయ హల్వా ఎలా తయారుచేయాలో చూద్దాం.

budida gummadikaya halwa Know the health benefits and making process of super tasty Kasi Halwa

తయారీకి కావలసిన పదార్థాలు

బూడిద గుమ్మడికాయ లేదా తెల్ల గుమ్మడికాయ - 1
చక్కెర- గుమ్మడికాయ తురుము కు సమానంగా
నెయ్యి -ఐదు టేబుల్ స్పూన్లు
జీడిపప్పు- 15
యాలుకలు- నాలుగు నుండి ఐదు
కుంకుమపువ్వు - ఒక చిటికెడు కాస్త నీటిలో నానబెట్టి
పచ్చ కర్పూరం- ఒక చిన్న చిటికెడు
నిమ్మరసం- కొద్దిగా

తయారీ విధానం

ముందుగా బూడిద గుమ్మడికాయను తీసుకుని దానిపైన పొట్టు లోపలి గింజలు తీసేసి సన్నగా తురుముకొని ఒక పల్చటి వస్త్రంలో వేసి గట్టిగా పిండి నీటిని వేరు చేయాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్, ఇష్టమైన డ్రైఫ్రూట్స్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులోనే మరింత నెయ్యి వేసి గుమ్మడికాయ తురుము వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.

గుమ్మడి కాయ హల్వా తయారీతో సూపర్ టేస్ట్

తురుము బాగా మగ్గిన తర్వాత అందులో చక్కెర వేసి ఉడికించాలి. చక్కెర బాగా పలుచగా అయ్యి మరలా బాగా దగ్గరగా వచ్చే వరకు గుమ్మడికాయ తురుముతో కలిపి ఉడికించాలి. చివరిగా మళ్లీ నెయ్యి, నానబెట్టుకున్న కుంకుమపువ్వు, చిన్న చిటికెడు పచ్చ కర్పూరం, ఏడెనిమిది చుక్కలు నిమ్మరసం, యాలుకల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలుపుకొని హల్వా లో నెయ్యి పైకి తేలేవరకు ఉడికించుకోవాలి.

కొబ్బరి బీరకాయ తొక్కల పచ్చడి.. ఇలా చేసి చూడండి, వదలకుండా తినేస్తారు!
కొబ్బరి బీరకాయ తొక్కల పచ్చడి.. ఇలా చేసి చూడండి, వదలకుండా తినేస్తారు!

స్టవ్ ఆఫ్ చేసి రుచికరమైన హల్వాను ఎంజాయ్ చెయ్యండి

హల్వా చేతికి అంటుకోకుండా ఉడికింది అంటే తయారై పోయినట్టే. అంతే స్టవ్ ఆఫ్ చేసి రుచికరమైన హల్వాను ఎంజాయ్ చేయాలి. దీనిని వేడిగాను చల్లగాను తినొచ్చు. చల్లారిన తర్వాత దీనిని తడి తగలకుండా జార్ లో నిల్వ చేస్తే వారం రోజుల పాటు బాగుంటుంది. ఈ హల్వా శరీరానికి కావలసిన శక్తిని ఇవ్వడంతోపాటు సెక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+