వైయస్ జగన్ ది తొందరపాటు: కాంగ్రెసు ఎంపి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar
న్యూఢిల్లీ\ హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయడం దురదృష్టకరమని ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మంగళవారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. జగన్ బయటకు వెళ్లి తొందరపడ్డారన్నారు. అధిష్టానం, ముఖ్యమంత్రి కలిసి మంత్రివర్గంలో సముచితమైన వారికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు.

అయితే బలహీన వర్గాల వారికి కాస్త ప్రాధాన్యం తగ్గిన మాట వాస్తవమేనన్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో న్యాయం జరిగేలా చూస్తారన్నారు. మంత్రులు సమర్థవంతంగా పని చేయాలన్నారు. వారు బాగా పనిచేసి రాష్ట్రాభివృద్ధికి పని చేయాలన్నారు. తద్వారా పార్టీ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. అయితే మంత్రివర్గ కూర్పునకు, తెలంగాణ నినాదానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

కాగా మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించకపోవటంపై ఎలాంటి నిరాశ లేదని శాసనసభ్యులు సుధీర్ రెడ్డి అన్నారు. ప్రస్తుత మంత్రివర్గంపై ఎలాంటి తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పని చేస్తామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+