కిరణ్ ఢిల్లీ యాత్ర: ఆ మూడు పదవుల ఖరారు కోసమే

ఉపముఖ్యమంత్రి పదవి కోసం దామోదర్ రాజనరసింహ, గీతారెడ్డిలు పోటీపడుతున్నారు. ఇప్పుడున్న సామాజిక సమీకరణాల దృష్ట్యా దామోదర్ రాజనరసింహకే ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవి తెలంగాణ ప్రాంతానికి ఇచ్చే అవకాశం ఉన్నందున స్పీకర్ పదవిని కచ్చితంగా సీమాంధ్ర ప్రాంతానికే ఇస్తారని సమాచారం. ఈ పదవికి జరుగుతున్న పోటీలో నాదెండ్ల మనోహర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈయనకు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గట్టి మద్దతు నిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి రేసులో మల్లు భట్టివిక్రమార్క ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తమకుమార్‌రెడ్డి పేరును ఇదివరకే చీఫ్‌విప్‌గా ఖరారు చేసినందున ఆ స్థానంలో ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు పదోన్నతి కల్పిస్తారని చెబుతున్నారు. దీనివల్ల తెలంగాణలోని రెండు సామాజిక వర్గాలను సంతృప్తిపరచ వచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీసీసీ అధ్యక్ష పదవి అంశం ఇప్పుడే తేలకపోవచ్చన్న భావన ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టిన తర్వాత పార్టీ వ్యవహారాలపై దృష్టిసారించాలన్న యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications