శ్రీకృష్ణ కమిటీ నివేదిక వాయిదాకు కిరణ్ కుమార్ పైరవీ?

Kiran Kumar Reddy
హైదరాబాద్: రాష్ట్ర పరిస్థితిపై అధ్యయనానికి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణను వాయిదా వేయించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ఈ నెల 30వ తేదీన లేదా 31వ తేదీన సమర్పించనుంది. గడువులోగానే డిసెంబర్ 31వ తేదీలోగా నివేదిక సమర్పిస్తామని శ్రీకృష్ణతో పాటు కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ కూడా చెబుతూ వస్తున్నారు. తన నివేదికను సమర్పించడానికి ఏ విధమైన జాప్యం చేయకూడదని కమిటీ భావిస్తోంది. అయితే, తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి కొద్ది రోజులే అయినందున రాష్ట్ర పరిస్థితులపై పట్టు సాధించాల్సిన అవసరం ఉందని, అందుకు తనకు కొంత సమయం పడుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

మూడు నెలల పాటు శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణను వాయిదా వేయించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఢిల్లీ స్థాయిలో అందుకు ఆయన పైరవీలు సాగిస్తున్నట్లు వినికిడి. రాష్ట్ర పరిస్థితిపై పట్టు సాధించిన తర్వాత నివేదిక వస్తే ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తనకు వీలు కలుగుతుందని ఆయన భావిస్తున్నట్లు వినికిడి. నివేదిక తెలంగాణకు అనుకూలంగా వస్తే సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణలో కూడా ఆందోళనలు తలెత్తే అవకాశం ఉంది. నివేదక సిఫార్సుకు వ్యతిరేకంగా సీమాంధ్రలో, దాన్ని అమలు చేయాలనే డిమాండ్ తో తెలంగాణలో ఆందోళనలు తలెత్తవచ్చు. తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే తెలంగాణలో తీవ్రమైన ఆందోళనలు ఉంటాయి. ఈ స్థితిలో తనకు తగిన పట్టు లభించే వరకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణలో జాప్యం జరిగితే బాగుండననే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+