తెలంగాణ, ఆంధ్ర తేడాలొద్దు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy
అదిలాబాద్: రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ, ఆంధ్ర అంటూ బేధాలు ఉండకూడదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అదిలాబాదులో సోమవారం అన్నారు. ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించడానికి సోమవారం ఉదయం హెలికాప్టర్లో కిరణ్ అదిలాబాద్ జిల్లా అర్జునగుట్టకు వెళ్లారు. పుష్కరాలను ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగసభలో మాట్లాడారు. పార్టీలు కూడా అన్నీ కలిసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అలా అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అదిలాబాదు జిల్లా పర్యటన ముఖ్యమంత్రిగా తన రెండో పర్యటన అని కిరణ్ చెప్పారు. అదిలాబాదులో గిరిజనులు ఎక్కువ అని, వారు చాలా వెనుకబడి ఉన్నారన్నారు.

వారి అభివృద్ధికోసం శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజధానికి తెలంగాణలో చాలా దూరంగా ఉన్న జిల్లా అదిలాబాదు అని, అందువల్ల ఇక్కడకు రావడానికి ఉద్యోగులు సైతం నిరాకరిస్తుంటారని, అయితే అలాంటి వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. అదిలాబాదులో గిరిజనుల ఆరోగ్య పరిస్థితులతోపాటు, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని కిరణ్ పుణ్యనది సభలో చెబుతున్నానంటూ వ్యాఖ్యానించారు. జిల్లాలోని పలు వైద్యశాలలకు సొంత భవనాలు లేనందున 45 లక్షల రూపాయలు ఈరోజే మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ మెడికల్ సైన్సు ప్రారంభించారన్నారు. ఎమర్జెన్సీ సెంటరు, ట్రామా సెంటరు వచ్చేలోపు దానిని పూర్తి చేస్తాన్నారు. వైద్యశాలలో ఇప్పటికే కొన్ని పోస్టులను భర్తీ చేశామని మిగిలిన వాటిని త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలు కోరుతున్న 14ఎఫ్ ను తొలగించడానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ విషయమై పార్లమెంటు సభ్యుడు వివేక్, హోంమంత్రి సబితారెడ్డిలతో మాట్లాడానన్నారు. అదిలాబాదును వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి కేంద్రం 25 కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు.

నేను ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రం మొదటిసారి విడుదల చేసింది అదిలాబాదు జిల్లాకే అని అన్నారు. రాష్ట్రానికి మరింత సాగునీటి వసతి కల్పిస్తామన్నారు. కాగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నేచరల్ ప్రాజెక్టుగా చేయడానికి ముఖ్యమంత్రిగా నా ప్రయత్నాలు నేను చేస్తానన్నారు. కేంద్రంపై ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్రంలోని 42 మంది పార్లమెంటు సభ్యులు కలిసి వెళ్లి ఒత్తిడి చేయాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తామని కిరణ్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+