నల్గొండ జిల్లాలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ, లాఠీఛార్జ్

Telugudesam
నల్గొండ: నల్గొండ జిల్లాలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. మునుగోడు నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు శాసనసభ్యులు ఉమామాధవరెడ్డి, చందరరావు, తెలుగుదేశం పార్టీ నేత అరవిందకుమార్ గౌడ్ సమక్షంలోనే తీవ్రస్థాయిలో గొడవ పడ్డారు. ఒకరిని ఒకరు తోసుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేయవలసి వచ్చింది. ఈ ఘటనలో సుమారు 35 మందికి గాయాలయ్యాయి. పలు సందర్భాల్లో పలుచోట్ల బయటపడ్డ తెలుగు తమ్ముళ్ల గొడవలు దీంతో మరోసారి బయటపడింది.

మునుగోడు నియోజకవర్గంలో కాశీనాథ్ ను ఇంఛార్జ్ గా నియమించటంతో సురెందర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. కాశీనాథ్ కి, ఉమామాధవరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీనుండి వెళ్లిపోవటానికి మీరే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చినికి చినికి ఈ వివాదం ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగే స్థాయికి చేరింది. ఎమ్మెల్యేలు, అరవింద్ కుమార్ గౌడ్ ఎంతగా వారించినా తమ్ముళ్లు వినలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+