కెవిపి రామచందర్ రావు పదవి ఊడనట్లే: కిరణ్ ఆదేశాలు ఉత్తవే

సలహాదారుల రాజీనామాల విషయంలో సీఎం ఆదేశాల్లోనే లోపం ఉండడం ప్రధాన కారణమని అంటున్నారు. ఆయన చెప్పినట్లు చేస్తే కేవీపీ సహా పలువురి రాజీనామాలను ఆమోదించడానికి వీల్లేదని అధికారవర్గాలు తెలిపాయి. రాజీనామాలు తీసుకునేందుకు పెద్ద తతంగం నడపాలి. సలహాదారులను తొలగిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు కానీ కేవీపీతో పాటు మరో 'సలహాదారు' సోమయాజులు హోదా ఎప్పుడో మారింది. కేవీపీ ప్రజాభద్రతా వ్యవహారాల కమిటీ చైర్మన్ కాగా సోమయాజులు వ్యవసాయ టెక్నాలజీ మిషన్ వైస్ చైర్మన్. 'సలహాదారులను తొలగిస్తున్నాం' అన్న ఆదేశం వీరిద్దరికీ వర్తించదు. వీరిని తొలగించాలంటే వేరే పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో సీఎం నుంచి ఇప్పటి దాకా ఆదేశాలు రాలేదు. ఇంకా సీసీ రెడ్డి, స్టాన్లీబాబు, సీఎస్‌రావు సలహాదారులుగా ఉన్నారు. చాలామంది కన్సల్టెంట్లుగా, ఓఎస్డీలుగా ఉన్నారు.
తొలగించాల్సి వస్తే వీరందర్నీ తొలగించాలి. సలహాదారులనే తప్పించాలంటే కేవీపీ, సోమయాజులు వంటి వారిని మినహాయించాలి. కొందరినే తొలగించి, మరికొందరిని కొనసాగిస్తే కొత్త సమస్యలొస్తాయి. దీంతో మొత్తం విషయాన్ని సీఎం పక్కన పెట్టేశారు. అధికారులు రాజీనామాలను కట్టగట్టి పక్కన పడేశారు. సలహాదారులంతా పోయినట్లేనని భావిస్తూ... సోమయాజులు చాంబర్‌ను జీఏడీ అధికారులు మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డికి కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. రాజీనామాల విషయంలో సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో నాలుక కరుచుకున్నారు. సోమయాజులు చాంబర్‌ను మంత్రికి కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్ని కూడా మార్చేశారు.












Click it and Unblock the Notifications