ఫైనల్స్ లో గెలుపు మనదే, 45 రోజుల్లో కొత్త పార్టీ: జగన్

చిన్నాన్న వైయస్ వివేకానందకు పదవి ఎరచూపి కాంగ్రెస్ పార్టీ దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని చీల్చాలని చూసిందని జగన్ అన్నారు. ఎండనకా, వాననకా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే కాకుండా కేంద్రంలో యూపిఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని చీల్చాలనుకోవడాన్ని తాను జీర్ణించుకోలేక పోయానని జగన్ అన్నారు. చిన్నాన్నతో పలుమార్లు మాట్లాడడానికి ప్రయత్నించానని చెప్పారు.
నన్ను ఒంటరిని చేసి బయటకు పంపించుదామనుకున్న కాంగ్రెస్ నుండి నేనే బయటకు వచ్చానన్నారు. నేను విలువలున్న వ్యక్తిని అని సమావేశంలో పలుమార్లు ఉద్ఘాటించారు. ఎండనగా, వాననకా కుటుంబాన్ని సైతం విడిచిపెట్టి చేసిన ఓదార్పు కార్యక్రమం యధావిధిగా సాగుతుందన్నారు. ఉప పోరుకు తాను అందుబాటులో ఉన్నా లేకున్నా మీరు అమ్మ విజయలక్ష్మికి తోడుగా ఉండాలని సూచించారు. రాష్ట్రానికి సువర్ణ పాలన అందిస్తేనే వైయస్ రాజశేఖరరెడ్డి ఆత్మ సంతోషించి, ఆశీర్వదిస్తుందని అన్నారు. ఉప పోరును రాష్ట్రమే కాదు, దేశమంతా ఆసక్తితో ఎదురు చూస్తుందన్నారు.












Click it and Unblock the Notifications