వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్ లో వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Julian Assange
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ ను లండన్ లో బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు. స్వీడన్ జారీ చేసిన ఐరోపా వారంట్ పై జూలియన్ అసాంజ్ ను అరెస్టు చేసినట్లు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు చెప్పారు. వికీలీక్స్ ద్వారా ఇంటర్నెట్ లో వేలాది ప్రభుత్వ రహస్యాలను బయటపెట్టినందుకు జూలియన్ అసాంజ్ అమెరికా ఆగ్రహానికి గురయ్యారు. లైంగిక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణపై 39 ఏళ్ల ఈ ఆస్టేలియన్ పై స్వీడిష్ ప్రాసిక్యూటర్స్ అరెస్టు వారంట్ జారీ చేశారు. ఈ ఆరోపణలను జూలియన్ అసాంజ్ ఖండిస్తున్నారు.

విచారణ నిమిత్తం అసాంజ్ న్యాయవాది వికీలీక్స్ వ్యవస్థాపకుడిని బ్రిటిష్ పోలీసుల ముందుకు తేవడానికి అంగీకరించారు. అప్పటి వరకు అసాంజ్ బ్రిటన్ లో అజ్ఞాతం ఉంటూ వచ్చారు. స్వీడన్ లో అత్యాచార అనుమానంపై, లైంగిక అత్యాచారంపై, చట్టవిరుద్ధమైన కార్యాలకు గాను అసాంజ్ పై కేసులు నమోదయ్యాయి. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఇంటర్ పోల్ అసాంజ్ పేరును నవంబర్ 30వ తేదీన చేర్చింది.

English summary
WikiLeaks founder Julian Assange has been arrested by British police on a European warrant issued by Sweden, London"s Metropolitan Police said on Tuesday. Assange has angered Washington by spilling thousands of government secrets on the Internet via WikiLeaks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X