విలువలకు కట్టుబడ్డాను కాబట్టే ప్రభుత్వాన్ని కూల్చలేదు: వైయస్ జగన్

ఒకవైపు తన సచ్ఛీలత, విశ్వసనీయత, తెలుగింటి ఆత్మగౌరవం ఉన్నాయనీ మరో వైపు కుళ్లు కుతంత్ర రాజకీయాలున్నాయని, ఈ స్థితిలో కడప ఉప ఎన్నికలకు ప్రాధాన్యం ఉందని, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ప్రధానమైన ఎన్నికలుగా ఇవి నిలుస్తాయని ఆయన అన్నారు. కడప, పులివెందులకు ఉప ఎన్నికలు రావడానికి గత 15 నెలల పరిణామాలే కారణమని ఆయన అన్నారు. తాను తన మనస్సాక్షి ప్రకారమే నడుచుకుంటున్నానని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కడప జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జ్యోతి రెడ్డి, పులివెందుల ఇంచార్జీ భాస్కర రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications